బింబిసార..టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

100
kalyan ram
- Advertisement -

టాలీవుడ్‌లో హీరోగా, నిర్మాత‌గా ప్రయోగాలు చేస్తూ ప్రేక్ష‌కులు హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.. మ‌రో ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈసారి చారిత్రక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క‌ళ్యాణ్ రామ్ తాజాగా ‘బింబిసార’ అనే హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. . క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు.

టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ను సైలెంట్‌గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల చివర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న “బింబిసార” టీజర్ విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రానికి వశిష్ఠ (నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది.

- Advertisement -