దేశంలో 24 గంటల్లో 10,488 కరోనా కేసులు..

90
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 10,488 కరోనా కేసులు నమోదుకాగా 313 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,10,413కు చేరగా 3,39,22,037 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,22,714 యాక్టివ్ కేసులుండగా 4,65,662 మంది మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,16,50,55,210 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

దేశవ్యాప్తంగా నవంబర్‌ 20 వరకు 63,16,49,378 నమూనాలకు కరోనా పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) తెలిపింది.

- Advertisement -