అక్కడే చివరి మ్యాచ్‌: క్లారిటీ ఇచ్చేసిన ధోని

87
dhoni

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోని తాజాగా దేశవాలీ క్రికెట్ పోటీల నుండి తప్పుకునేందుకు సమయం ఆసన్నమైందని అంటూనే తెలివిగా సమాధానం తెలిపాడు.

చెన్నై..ఐపీఎల్ 2021 విజేతగా నిలిచిన సందర్భంగా సంబరాలు నిర్వహించగా ఈ సందర్భంగా మాట్లాడిన ధోని.. చెన్నైలోనే తన చివరి టీ20 మ్యాచ్ ఉంటుందని అయితే అది వచ్చే ఏడాదా? లేదా ఐదేళ్ల తర్వాత అనేది తనకి తెలియదని చెప్పుకొచ్చాడు.

భారత్‌లో నేను చివరి వన్డేని రాంచీలో ఆడాను. అలానే నా చివరి టీ20 మ్యాచ్‌ని చెన్నైలో ఆడతాను. ఫ్యాన్స్‌ మమ్మల్ని నడిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆడుతున్నా.. అక్కడికి వచ్చి సపోర్ట్ చేశారని తెలిపాడు. టీమ్‌పై నిషేధం ఉన్న రెండేళ్లు కూడా సోషల్ మీడియాలో చెన్నై టీమ్ గురించి అభిమానులు ఎక్కువగా మాట్లాడటం వారి ప్రేమకి నిదర్శనం అన్నాడు.