బిగ్ బాస్‌ 5..ఈవారం అనీ మాస్టర్ ఔట్!

33
ani

బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకోనుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో ప్రియాంక, సిరి, షణ్ముఖ్,మానస్, కాజల్,సన్నీ,శ్రీరామచంద్ర,అనీ మాస్టర్ ఉండగా ఇందులో సన్నీ, శ్రీరామచంద్ర ఇద్దరూ సేవ్ అయ్యారు.

ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఓటింగ్ ప్రకారం ఈ వారం అనీ మాస్టర్ ఇంట్లో నుండి ఎలిమినేట్ కావడం పక్కాగా కనిపిస్తోంది. అనీకి అందరి కంటే అతి తక్కువ సంఖ్యలో ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ కావడం పక్కా.

ఆమె గత రెండు వారాల్లో అనవసరంగా అరవడం, అతిగా ఏడవడం, ఇతరులను వెక్కిరిస్తూ అనుకరించడం వంటి కారణాలతో ప్రేక్షకులకు చికాకు కలిగించింది.