రైతు మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి: కిసాన్ మోర్చా

67
kisan
- Advertisement -

రైతుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది కిసాన్ మోర్చా. మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామన్నారు. పార్లమెంటరీ విధానాల ద్వారా ప్రకటన అమలులోకి వచ్చే వరకు వేచి చూస్తాం అన్నారు. ఇది జరిగితే భారతదేశంలో ఒక సంవత్సరం పాటు సాగిన రైతుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయం అన్నారు.

ఆందోళనలో 700 మంది రైతులు మరణించారు.. లఖీంపూర్ ఖేరి లో ఆందోళన చేస్తున్న రైతులను చంపారు.రైతుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు.ఇంకా పెండింగ్ లో చాలా అంశాలు ఉన్నాయి…కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే అన్ని రైతు సంఘాల నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు.

- Advertisement -