ఎట్టకేలకు హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఫైనలయ్యారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు) పేరును ఖరారు చేసిన రాష్ట్ర పార్టీ… అధిష్ఠానం ఆమోదం కోసం పంపించింది. అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘ మంతనాలు జరిగిన టీపీసీసీ….చివరకు విద్యార్థి నాయకుడి పేరును ఖరారు చేసింది.
రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా బల్మూరు వెంకట్ రెండు పర్యాయాలుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం వెంకట్ పేరును ఖరారు చేశారు. విద్యార్థి, నిరుద్యోగ సైరన్ సందర్భంగా వెంకట్ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి.
బల్మూర్ వెంకట్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ నుండి విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే పోటీలో ఉన్నట్లు సమాచారం.