గ్రేటర్‌లో కంటోన్మెంట్ విలీనంతో ప్రజలకు మేలు: తలసాని

194
talasani
- Advertisement -

జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ ఏరియా విలీనం అయితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్‌ కంటోన్మెట్‌ సిల్వర్‌ కాంపౌండ్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని….దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.

కంటోన్మెంట్ కు ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడంతో అభివృద్ధి జరగడం లేదని….. జిహెచ్ఎంసిలో విలీనం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల మాదిరిగానే కంటోన్మెంట్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని పేర్కొన్నారు.

సీఎంగా కేసీఆర్‌ ఉన్నందుకు తెలంగాణ ప్రజలంతా అదృష్టవంతులని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ అందిస్తున్న సహకారంతో ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

- Advertisement -