మంత్రి హరీష్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేతలు..

23

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు కొనియాడారు. బుధవారం కమలాపూర్ మండలానికి చెందిన 100 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి హరీష్‌ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదు. వారు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అని దుయ్యబట్టారు.

గౌడ్ కులస్తులకు వైన్స్ లలో రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ-కాంగ్రెస్ నేతలు ఎప్పుడైనా ఆలోచించారా? అని మంత్రి ప్రశ్నించారు. కాకతీయ మేఘా టెక్స్ టైల్ పార్క్ ద్వారా వేలాదిమందికి జీవనోపాధి రాబోతుంది. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయడం కోసం హుజురాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్-బీజేపీలు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు వారిని నమ్మరు అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.