బర్త్ డే…జమ్మి మొక్క నాటిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్

66
korukanti chander

రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటాలని కోరారు.

ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జమ్మి మొక్క నాటారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మన దేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో బాగస్వమ్యం అయి మొక్కలు నాటుతున్నారని ఎమ్మెల్యే చందర్ అన్నారు.

ఈ దసరా పండుగ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఊరు ఉరుకో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో బాగంగా రామగుండం నియోజవర్గంలో పెద్ద ఎత్తున జమ్మిచెట్లు నాటుతామని అన్నారు. మన రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేల ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభినందనలు తెలియజేశారు.