దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,352 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,03,289కి చేరింది. అలాగే, గత 24 గంటల్లో 34,791 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 366 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,39,895కి పెరిగింది.
ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,20,63,616 మంది కోలుకున్నారు. 3,99,778 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 67,09,59,968 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది.
కాగా, దేశంలో గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 32,097 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో కొత్తగా 188 మంది మరణించారని తెలిపింది. 1,74,307 మందికి పరీక్షలు చేయగా 32 వేల మందికి పాజిటివ్ వచ్చిందని, పాజిటివిటీ రేటు 18.41గా ఉందని వెల్లడించింది.