యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ కెరీర్‌లో రూపొందుతోన్న 30వ చిత్రం ఒకే ఒక జీవితం
.ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంభందించి ఒక స్నీక్ పీక్ ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ వీడియోలో పాట పాడమని కొందరు ఆదీని కోరడం అలాగే మ్యూజిక్ ఇన్స్‌ట్రూమెంట్స్‌ని చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ ప్రోమో ముగుస్తుంది. చివరలో శర్వానంద్ గిటార్ వాయించడం మనం చూడొచ్చు. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శర్వానంద్ సరసన మన తెలుగమ్మాయి రీతు వర్మహీరోయిన్‌గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.
జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తుండగా డియర్ కామ్రెడ్
ఫేమ్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగమయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో శర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కి నచ్చే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్తయ్యింది
. త్వరలో విడుదలకు సిద్దమైంది.
తారాగణం: శర్వానంద్, రీతు వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: శ్రీ కార్తిక్
నిర్మాతలు:ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
మాటలు: తరుణ్ భాస్కర్
డిఓపి: సుజిత్ సారంగ్
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటర్: శ్రీజీత్ సారంగ్
ఆర్ట్: ఎన్. సతీష్ కుమార్
స్టంట్స్: సుదేశ్ కుమార్
స్టైలిస్ట్: పల్లవి సింగ్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కృష్ణకాంత్
పిఆర్ఓ : వంశీ – శేఖర్