ఒకే ఒక జీవితం ఓటీటీలోకి ఎప్పుడంటే….

103
- Advertisement -

చాలా కాలం త‌ర్వాత శ‌ర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. శ్రీకార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9న విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. మొద‌టి రోజు నుండి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీ రేంజ్‌లో రాక‌పోయినా రోజు రోజుకు ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆదర‌ణ పెరుగుతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీలో అక్కినేని అమ‌ల కీల‌క‌పాత్ర పోషించింది. కాగా ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్‌ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను అక్టోబర్‌ 10నుండి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో శర్వాకు జోడీగా రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్‌ ప్ర‌కాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.8 కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా రూ.11 కోట్ల వరకు షేర్‌ను సాధించి సూపర్‌ హిట్‌గా నిలిచింది.

- Advertisement -