నితిన్ ‘మాస్ట్రో’ నుండి అదిరిపోయే సాంగ్ ప్రోమో..

269
Maestro
- Advertisement -

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. నితిన్‌కు ఇది 30వ సినిమా. ఈ సినిమాలో ఆయన జోడీగా నభా నటేష్‌ నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, షూటింగును పూర్తిచేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమో వదిలారు. ‘బేబీ ఓ బేబీ’ అంటూ ఈ పాట సాగుతోంది. పూర్తి పాటను శుక్రవారం ఉదయం 10:08 నిమిషాలకు విడుదల చేయనున్నట్టుగా చిత్ర బృందం తెలిపింది.

హీరోయిన్ ను ముగ్గులోకి దింపే ప్రయత్నంలో హీరో పాడే పాటగా ఇది తెరపై ప్రత్యక్షం కానుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. శ్రీ జో సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. హిందీలో హిట్ టాక్ తెచ్చుకున్న ‘అంధదూన్’ సినిమాకి ఇది రీమేక్. ఇందులో తమన్నా కీలకపాత్రలో నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల కానుంది.

https://youtu.be/7D7_XBeOn2s
- Advertisement -