దీపకు గుడి కట్టాలనుకున్నా..డాక్టర్ బాబు ఎమోషన్..?

157
doctor babu
- Advertisement -

బుల్లితెర పాపులర్ సీరియల్ కార్తీకదీపం 1082 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 1083వ ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. కార్తీక్ – దీప – సౌందర్య మధ్య మోనీతతో పెళ్లి గురించి చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా కార్తీక్‌ ఎమోషనల్‌ అవుతూ తనకేం తెలియదని ఏ తప్పు చేయలేదని బాధపడిపోతాడు. తన నటనతో ఈ ఎపిసోడ్‌ని రక్తికట్టించాడు నిరుపమ్.

మోనిత..దీపకు కాల్ చేసిన తర్వాత అది కావాలనే రెచ్చగొడుతుందని దీపకు సర్దిచెబుతుంది సౌందర్య. అయితే మోనిత…దీపకు ఫోన్ చేసి కావాలనే తనను ఇరికించిందని అదే తల్చుకుంటూ నడుస్తూ వస్తాడు కార్తీక్. దీంతో కార్తీక్‌ని చూసి కారు ఆపిన సౌందర్య..ఏమైంది అంటూ అడుగుతుంది. సుడిగుండంలో మునిగిపోయారు.. ఊపిరి ఆడనట్లుంది.. జీవితం మీద విరక్తి పుడుతుంది మమ్మీ అంటాడు కార్తీక్. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు జరగబోయేది ఏంటి అనేదాని గురించి ఆలోచించాలని కార్తీక్‌తో సౌందర్య చెబుతుంది. తనకు ఏం అర్ధం కావడం లేదు…నేను నటించడం లేదని తెగ బాధపడిపోతాడు కార్తీక్. దీపకు గుడి కట్టి దేవతలా చూసుకోవాలనుకున్నాను.. కానీ ఆశలకి నేను సమాధి కట్టాను అని అక్కడి నుండి వెళ్లిపోతాడు.

ఇక దీప…జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే అక్కడికి వచ్చిన కార్తీక్…దీపకు సారీ చెబుతాడు. తాను మోనితతో ఏం చెప్పలేదని…అసలు షాపింగ్ బట్టలు కూడా తనకు సంబంధం లేదంటాడు. తనకు మోనిత గురించి తెలుసు డాక్టర్ బాబు అని చెప్పిన దీప..కళ్లు పెద్దవి చేస్తూ మీ గురించి అర్ధం కావడం లేదని చెబుతుంది. మీ పెళ్లి..? 25 తారీఖు తేదీన.. రిజిస్టర్ ఆఫీస్‌లో.. ఈ సంగతి ఎవరో చెబితే తప్ప నాకు తెలియదు అనగానే కార్తీక్ షాకవుతాడు. మీ ప్రమేయం లేకుండానే ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించగా అది తన దురదృష్టం అంటాడు కార్తీక్.

మరి మోనిత ఒక్కర్తే వెళ్లి తాళికట్టుకుని మెడలో దండేసుకుని వస్తుందా…పెళ్లి బట్టలు కూడా సిద్ధంగా ఉన్నాయి..వాటి మాటేంటి? నా మాటేంటీ నా పిల్లల మాటేంటీ? పిల్లలకి ఈ సంగతి తెలిస్తే వాళ్ల దృష్టిలో మీరేంటీ? అని అరుస్తుంది. అసలు ఆరోజే అది రిపోర్ట్ చింపి తిట్టి పంపించేసి ఉండి ఉంటే.. మిమ్మల్ని నేను నమ్మేదాన్ని. మీ మౌనం అంగీకారంగానే మా అందరికీ కనిపించిందని చెప్పగా అనుమానిస్తున్నావా అని కార్తీక్ చెప్పగా పెళ్లి గురించి నీకు ఇప్పుడు తెలిస్తే నాకు కాస్త ముందు తెలిసింది అంటాడు కార్తీక్.

మోనిత తనను బొమ్మని చేసి ఆడుకుంటుందని.. ఫోన్ ఎత్తకపోతే బెదిరింపులు.. కలవకపోతే హెచ్చరికలు.. నన్ను ఒక మరబొమ్మలా మార్చేసింది. ఫలానా తేదీన నా పెళ్లి అని ఎవడైనా ఏ భార్యకైనా చెబుతాడా? అలాంటిది ఆ పెళ్లికి నిన్ను మా అమ్మని తీసుకుని రమ్మని కండీషన్ పెట్టింది.. అది జరుగుతుందా? జరిగే పనేనా?ఎవరికి చెప్పను? ఎవరితో చెప్పుకోను.. చచ్చాక ఆ దేవుడితో చెప్పుకోవాలా? అని కార్తీక్ తన బాధను వ్యక్తంచేయగా దీప కాస్త కూల్ అవుతుంది. నాకు మోనిత మీద ఎలాంటి ఉద్దేశం లేదు.. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.. మోనితని ఇంతకాలం ఒక ఫ్రెండ్‌లానే చూశాను.. ఇప్పుడు మోనిత మోనితలా లేదు.. అది నా తప్పు కాదని పిల్లలు రాగానే అక్కడినుండి వెళ్లిపోతాడు కార్తీక్. మొత్తంగా తన నటనతో రాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందోననే ఆసక్తిని పెంచేశాడు డాక్టర్ బాబు.

- Advertisement -