కార్తీక దీపం…రంగంలోకి ఏసీపీ రోషిణి..!

223
karthika deepam

బుల్లితెర పాపులర్ సిరీయల్ కార్తీకదీపం విజయవంతంగా 1091 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. కార్తీక్‌ని దక్కించుకునేందుకు మోనిత పోలీసులను ఆశ్రయించగా ఎంక్వైరీలో భాగంగా దీప,మోనిత దగ్గరికి వెళ్లి వివరాలను రాబడుతుంది ఏసీపీ రోషిణి.

తొలుత దీప దగ్గరికి ఏసీపీ రోషిణి రాగా నా పేరు దీప.. నా భర్త పేరు కార్తీక్. డాక్టర్ కార్తీక్.. మాకు ఇద్దరు కవలలు.. ఆడపిల్లలు.. మా అత్తగారు మామగారికి సొసైటీలో ఎంత గౌరవం ఉందో మీకు చెప్పక్కర్లేదని చెబుతుంది. నేను మావారు దాదాపు పదేళ్ల పాటు విడివిడిగానే ఉన్నాం.. ఈ పదేళ్లలో జరగని తప్పు.. నేను ఆయన తిరిగి కలుసుకున్నప్పుడే ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేని చెబుతుంది దీప. అయితే మోనితతో జరిగిన తప్పులో కార్తీక్ ప్రమేయం లేదంటావా అని రోషిణి…దీపను ప్రశ్నించగా ఆయన నన్ను ఆదర్శంతో పెళ్లి చేసుకున్నారు.. నేను ఆయన్ని దేవుడిలానే చూసుకున్నాను.. మధ్యలో ఏవో మనస్పర్థలు.. అయినా ఆయనే కావాలని కోరుకున్నాను.. నా పవిత్రతే మళ్లీ కలిపింది. మోనిత ఆరోపణే నిజమైతే.. మీరే మా ఆయనకి ఎలాంటి శిక్షనైనా విధించండి అంటుంది దీప. సరిగ్గా అప్పుడే కార్తీక్ పిల్లల్ని తీసుకుని.. ఇంటికి వస్తాడు. రోషిణి కారు చూసి షాక్ అవుతాడు.

సీన్ కట్ చేస్తే…. మోనిత కోసం వెయిట్ చేస్తూ మోనిత ఇంట్లో కూర్చుని ఉంటుంది భాగ్యం. భాగ్యాన్ని చూసిన మోనిత..కోపంతో అరవగా భాగ్యం కూల్‌గా నవ్వుతూ.. గాజులు, చీర, రవిక అన్నీ తెచ్చాను.. నీకు శ్రీమంతం చేస్తాను.. కడుపుతో ఉన్నవారికి చెయ్యాలి కదా అంటూ రెచ్చగొడుతోంది. తర్వాత మాటమాట పెరిగి భాగ్యాన్ని ఇంట్లో నుండి పంపించే ప్రయత్నం చేస్తుంది మోనిత.

దీప దగ్గరి నుండి మోనిత దగ్గరికి రోషిణి రాగా దీప ఏం చెప్పింది అనేదానిపై ఆరా తీస్తుంది మోనిత. ఎంక్వైరీకి వెళ్లారు కదా మేడమ్.. దీప ఏం అంది అని అడగగా ‘దీప మాటల్లో కార్తీక్‌ని నమ్ముతుందని అర్థమైంది. ఈ తప్పుకి తన భర్తకి సంబంధం లేదని దీప చెప్పింది అని రోషిణి తెలపగా ఆస్తికోసం ఆలోచిస్తుంది అంటుంది మోనిత. దీప ఇప్పుడు ఉంటున్న ఇల్లు కార్తీక్ రాసిచ్చాడా? అంటుంది రోషిణి. ‘ లేదు అది అద్దె ఇల్లు.. అంటుంది మోనిత. ఆస్తి గురించి ఆలోచించేదైతే అద్దె ఇంట్లో ఎందుకు బతుకుతుంది? అని ప్రశ్నిస్తుంది. నీ ముఖంలో బాధలేదు.. దీప ముఖంలో భయం లేదు.. కార్తీక్ కళ్లల్లో కంగారు లేదు.. అని రోషిణీ అనుమానంగా అనగా తన కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించండి మోనిత చెప్పడంతో మీ కడుపులో బిడ్డ ఉంది కాబట్టి నేను మీకు న్యాయం చెయ్యాలని ఆలోచిస్తున్నానుని అని మోనితతో చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.