వెండితెరపై వంటలక్క!

122
nc22
- Advertisement -

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసందే. NC22 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా కనిపించనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వంటలక్క కూడా నటించనుంది. కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్కగా ప్రేక్షకులకు పరిచయమైన ప్రేమ విశ్వనాథ్ కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని అనౌన్స్‌చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

రెండు సంవత్సరాలకు పైగా విజయవంతంగా సాగుతున్న కార్తీకదీప సీరియల్‌లో నిరుపమ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. వంటలక్క పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ సినిమాలో సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరన్, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -