కొరటాలకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన ‘ఆచార్య’..

142
Chiranjeevi
- Advertisement -

టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ కొరటాల శివ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘ఆచార్య’ సృష్టికర్త కొరటాల శివకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

“ఆ కలానికి సమాజంలో మార్పు తేవాలన్న తపన ఉంది. ఆ దర్శకుడికి ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది” అంటూ చిరు కొరటాలపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -