ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త క‌లెక్ట‌రేట్ల నిర్మాణం- ఎర్ర‌బెల్లి

184
minister errabelli
- Advertisement -

హన్మకొండలో సిద్ధమవుతున్న నూతన సమీకృత కలె క్టరేట్ భవనాన్ని మంగళవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, సీసీఎఫ్ ఆశ, డీఎఫ్ఓ అర్పన, డీఆర్వో వాసు చంద్ర, ఆర్ అండ్ బీ ఎస్ఈ. నాగేందర్ రావు అధికారులు పాల్గొన్నారు.

ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 21న జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనలో భాగంగా నూత‌నంగా నిర్మిస్తున్న వ‌రంగ‌ల్ అర్బన్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్ ను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. అదే విధంగా 24 అంతస్తుల మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి కూడా భూమి పూజ చేస్తారని మంత్రి తెలిపారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనానికి 35 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించగా.. దాదాపు 57 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకే నూతన కలెక్టరేట్లను నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్ మొత్తం దాదాపు ఒక లక్షా 57 వేల అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని వివరాలను వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల సత్వర ప‌రిష్కారం, అభివృద్ది కోస‌మే చిన్న జిల్లాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ‌ను బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్న‌చూపు చూస్తోంది. నిధులు, హ‌క్కుల కోసం నాడు స‌మైఖ్య పాల‌కుల‌పై పోరాటం.. నేడు కేంద్ర పాల‌కుల‌పై పోరాటం చేశాం. అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి, నేడు దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ముఖ్య‌మంత్రి కేసిఆర్ ముందుచూపుతోనే తెలంగాణ‌కు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో ధాన్యం ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా పెరిగింది, ధాన్యం ఉత్ప‌త్తితో దేశానికే అన్న‌పూర్ణ‌గా నిలిచిన తెలంగాణ రాష్ట్రం. కేసిఆర్ పాల‌న‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు. అందరి అభిప్రాయం మేరకే వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సీఎం వరంగల్ పర్యటన సంధర్భంగా ప్రజలంతా చప్పట్లతో అభినందించాలని పిలుపు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.

- Advertisement -