కరోనా కట్టడిలో భాగంగా డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) . పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేయగా వచ్చే నెల నుండి రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది.
ఈ విషయాన్ని వెల్లడించారు మంత్రి కేటీఆర్.ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేటీఆర్…వచ్చే నెల నుండి 2డీజీ డ్రగ్ అందుబాటులోకి వస్తుందని డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఛైర్మన్ హామీ తనకు ఇచ్చారని తెలిపారు.
2డీజీ ఔషధం ఇప్పటికే దేశ రాజధాని డిల్లీలో విడుదల చేశారు. . ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని డీఆర్‌డీఓ పేర్కొంది.