ఉస్మానియాను సందర్శించిన మేయర్ విజయలక్ష్మీ..

46
vijayalaxmi

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి. ఈ సందర్భంగా ఉస్మానియా పరిసరాలను పరిశీలించిన మేయర్…
పారిశుద్ధ్యం నిర్వ‌హ‌ణ ప‌ట్ల అధికారుల‌పై మేయ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న ప‌ట్ల రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా, ప‌రిస‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రంగా ఉంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పారిశుద్ధ్యం ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విజ‌య‌ల‌క్ష్మి హెచ్చ‌రించారు.

కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్‌ కఠినంగా అమలవుతుండటంతో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.