- Advertisement -
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్‌ను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన సభ్యులుగా నియమితులైన టీఎన్జీఓ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు.. కారం రవీందర్ రెడ్డిని నియమించినందుకు ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. టీఎస్పీఎస్సీ నూతన సభ్యులుగా నియమితులైన కారం రవీందర్ రెడ్డిని అభినందించారు.
ఈ అభినందన కార్యక్రమంలో టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
- Advertisement -