తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వలి అనుకున్న శశికళ ఆశ….ఆశగానే మిగిలిపోయింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసిన వీకే శశికళకు భారీ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మను దోషి అని అని కొద్ది గంటల క్రితమై సుప్రీం కోర్టు ప్రకటించింది. నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదికోట్ల రూపాయిల జరిమాన విధించింది కోర్టు.
అయితే సుప్రీంకోర్టు శశికళను దోషిగా ప్రకటించిన కొద్ది నిమిషాలకే కువత్తూర్‌లోని గోల్డెన్ బే రిసార్ట్స్‌లో చిన్నమ్మ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో అత్యవసరం సమావేశం నిర్వహించింది. పన్నీర్‌సెల్వంకు ఎలగైన సీఎం పీఠం దక్కకుండా ఉండడానికి తన శిబిరంలోని వ్యక్తికే పార్టీ పగ్గాలు అప్పగించడమే లక్ష్యంగా శశికళ ఈ సమావేశం జరిపింది. పార్టీ ముఖ్యనేత ఎడపాడి కే పళనిసామిని శశికళ స్థానంలో ఎన్నుకున్నట్లు ఏడీఏడీఎంకే శశికళ వర్గం ప్రకటించింది. ఈ సమావేశంలో జయ మేనల్లుడు దీపక్ కుమార్ కూడా ఉన్నారు. దీంతో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావును పళనిస్వామి కొరనున్నారు.
తనను అరెస్టు చేసే లోపు పళనిసామినికి సీఎం పగ్గాలు అప్పగించి పోవలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు వీకె శశికళ. ఇక న్యాయస్థానం తీర్పుతో చిన్నమ్మ వర్గం నిర్ఘాంతపోయింది అని చెప్పవచ్చు. అక్రమాస్తుల కేసులో జయలలిత ప్రధాన నిందితురాలు కాగా, సహనిందితులుగా శశికళ, ఇళవరసి, సుధాకరన్ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పన్నీర్ సెల్వం నివాసంలో సంబరాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా పన్నీర్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తూ ఏర్పాటు చేశారు.
తెరపైకి ఇకే పళనిసామి….
- Advertisement -
- Advertisement -