నమ్రత కొత్త స్టైల్‌ కి కారణమేంటో..?

72
Namrata's New Look

మహేష్ బాబు భార్య నమ్రత ఇప్పుడు కొత్త లుక్స్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆమె అలా కనబడడానికి కారణం…ఓ మొక్కులో భాగంగా తలనీలాలు అర్పించడమే. అందుకే నమ్రత కొత్త లుక్స్ తో కనిపిస్తూ సందడి చేస్తోంది. నమ్రత స్టైలింగ్ మార్పు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ గా హైద్రాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో జరిగిన ఈవెంట్ లో కనిపించిన నమ్రత లుక్స్.. అందరినీ ఆకట్టుకున్నాయి.

అలాగే ఇప్పుడు మరో ఈవెంట్ లో జీన్స్ ప్యాంట్.. ఫార్మల్ చెక్స్ టాప్ తో డిఫరెంట్ గా కనిపించింది నమ్రత. ఇప్పుడు సడెన్ గా నమ్రతా శిరోద్కర్ ఇలా స్టైలింగ్ ఛేంజ్ చేయడానికి ఓ రీజన్ వినిపిస్తోంది. తను ఓ మల్టీస్టారర్ సినిమా కోసమే..తన లుక్స్ విషయంలో మార్పులు తెచ్చుకుంటోందని అంటున్నారు టాలీవుడ్ జనాలు. నమ్రత ఓ మల్టీస్టారర్ లో కనిపించబోతున్నట్లు రీసెంట్ గా ఈమె రివీల్ చేసిన సంగతి అందిరికీ తెలిసిందే.

మరి ఇంత సస్పెన్స్‌ క్రియేట్ చేస్తున్నఆ మల్టీ స్టారర్ సినిమా కూడా ఏదో తెలిసిపోతే.. సస్పెన్స్ మరింతగా విడిపోతుంది. ఏదేమైనాజ…బాబ్ హెయిర్ కట్.. బెల్ బాటమ్ ప్యాంట్స్.. యాపిల్ కట్ షర్ట్ లో నమ్రత లుక్ అదిరిపోయిందనే చెప్పాలి.