- Advertisement -
తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే తిరుగులేని విజయం సాధించింది. తొలిసారి సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 7న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు స్టాలిన్.
కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని స్టాలిన్ స్పష్టం చేశారు. తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్టాలిన్ చెప్పారు. తమిళనాట 159 సీట్లు గెలిచి డీఎంకేను పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో స్టాలిన్ కీలక పాత్ర పోషించారు.స్టాలిన్ కొలత్తూరు నుంచి ఆయన తనయుడు ఉధయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
- Advertisement -