అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

56
us

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. విస్కాన్సిన్ లోని అశ్వాబెనోన్ ప్రాంతంలోని ఓ క్యాసినోకి జొరబడి దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కాల్పులు జరపడంతో దుండగుడు మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే దుండగుడు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది.