అద్భుతమైన కెమెరామెన్‌గా, వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసిన దర్శకుడు కేవీ ఆనంద్(45) ఇకలేరు. ఇవాళ ఉదయం చెన్నైలోని తన ఇంట్లో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో తెలుగు, తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
తెలుగులో ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి సినిమాలు చేసిన ఆనంద్. మోహన్ లాల్, సూర్య, ధనుష్, తమన్నా, విజయ్ సేతుపతి వంటి స్టార్స్‌తోను కలిసి పని చేశారు.
డైరెక్టర్ కేవీ ఆనంద్ ఇక లేరనే విషాద వార్తతో నిద్ర లేచాను… మంచి కెమెరామెన్, గొప్ప దర్శకుడు, మంచి మనిషిని కోల్పోయాం.మీరు ఎప్పటికీ మా మనసులలోనే ఉంటారని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు అల్లు అర్జున్. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని వెల్లడించారు.