సూర్యతో మోహన్‌లాల్‌..

233
Mohanlal in Suriya-KV Anand film
- Advertisement -

ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఈ సినిమా రేంజ్ అమాంతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుండటంతో ఇద్దరి హీరోల కలయికలో వచ్చే సినిమాకుల నిర్మాతలు కూడా  పచ్చ జెండా ఊపేస్తున్నారు.

 Mohanlal in Suriya-KV Anand film

గతంలో చాలా సినిమాలు మల్టీస్టారర్‌గా విడుదలై కొన్ని విజయాలు సాధించగా  మరికొన్ని ప్లాఫ్‌ను మూటగట్టుకున్నాయి. తలలు పండిన హీరోలకు కూడా ఇతర హీరోల సినిమాల్లో నటించేందుకు  ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అలాంటి ఇద్దరు హీరోల కలయికలో  మారోసారి తెరకెక్కించే పనిలో ఉన్నాడు డైరెక్టర్ కె.వి. ఆనంద్‌. గతంలో సూర్యతో వీడొక్కడే, బ్రదర్స్‌ వంటి సినిమాలు మల్టీస్టారర్‌గా తెరకెక్కించారు ఆనంద్.

మూడోసారి ఇద్దరు హీరోలతో కలిసి ఓ సినిమా చేసే ఆలోచనకు తెర తీశారు. సూర్య హీరోగా కె.వి ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మారో హీరో కోసం వెతికెపనిలో ఉండగా మాలీవుడ్‌ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ను ఎంపిక చేసుకున్నట్లు లైకా సంస్థ అధికారికంగా వెల్లడించి. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ను ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట చిత్ర యూనిట్. గతంలో తెలుగులో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలోఎన్టీఆర్, మోహన్‌లాల్ కలిసి నటించిన విషయం తెలిసిందే.

- Advertisement -