దేశంలో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

45
corona

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3500కి పైగా మృత్యువాతపడ్డారు.

మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 60వేలు దాటిపోతుండగా మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజు 30 నుంచి 40 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్‌ కారణంగా మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ని పొడగించారు.