స్టార్‌ హీరోను కామెంట్స్‌ చేసిన యాంకర్స్‌..

246
Tamil Anchors Make Fun Of Surya's Height
- Advertisement -

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య. తాజాగా ‘గ్యాంగ్‌’ సినిమాతో సక్సెస్‌ అందుకున్నారు. సూర్య హైట్ గురించి ఓ త‌మిళ మ్యూజిక్ చానెల్ యాంక‌ర్లు చేసిన చెత్త కామెంట్లు త‌మిళ‌నాట వివాదం రెకెత్తిస్తున్నాయి. ఆ యాంకర్లు చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న అభిమానుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి.

అసలు విషయం ఏంటంటే సూర్య తన తర్వాతి చిత్రం కోసం సిద్ధమౌతున్నారు. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా ఈ నూతన చిత్రంలోని పాత్ర కోసం దర్శక, నిర్మాతలు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను కలిశారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి ఓ ప్రముఖ తమిళ ఛానెల్‌ షోలో ఇద్దరు మహిళా యాంకర్లు మాట్లాడారు. ‘సింగం’ సినిమాలో సూర్య కన్నా అనుష్క ఎత్తుగా ఉన్నారని, ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్‌ను తీసుకున్నా అదే జరుగుతుందని వ్యంగ్యంగా అన్నారు. సూర్య.. అనుష్కతో నటించినప్పుడు హీల్స్‌ వేసుకున్నారని, ఇప్పుడు అమితాబ్‌తో నటించాలంటే స్టూల్‌ వేసుకోవాలని నవ్వుతూ అన్నారు.

Tamil Anchors Make Fun Of Surya's Height

అంతే ఈ షో వీడియో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరోను అవమానించారంటూ అభిమానులు ఛానెల్‌పైన, యాంకర్లపైన మండిపడ్డారు. అంతేకాదు ఛానెల్‌ ఎదుట ఆందోళన చేశారు. ఇదే విషయంపై ప్రముఖ హీరో విశాల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.‘ఇది ఏ మాత్రం ఫన్నీ కాదు.. వినోదం కోసం చెప్పే మాటలా ఇవి. పూర్తిగా బుద్ధిలేని వ్యాఖ్యలు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వివాదం ముదరడంతో సూర్య స్పందించారు. ‘ఇలాంటి చిన్న స్థాయి విమర్శలకు స్పందించి, మన విలువను తక్కువ చేసుకోకూడదు అన్నారు. మీ సమయాన్ని, శక్తిని అవసరమైన పనుల కోసం ఉపయోగించండి’ అని అభిమానులను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

 

- Advertisement -