నిజాంపేట డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఏఎస్సై మహిపాల్ రెడ్డి మృతికి పోలీస్ శాఖ కన్నీటి నివాళి అర్పించింది. అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్….మహిపాల్ పాడే మోశారు. అంత్యక్రియల కోసం రూ. 50 వేలు ఇచ్చారు. మహిపాల్ రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు, పోలీసులు వచ్చారు. బ్రెయిన్ డెడ్ కావడంతో మహిపాల్ రెడ్డి కిడ్నీలు, కాలేయం దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో నిజాంపేట్ రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు చేశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన అస్లాం అనే వ్యక్తి మద్యం మత్తులో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపైకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మహిపాల్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మహిపాల్‌రెడ్డి తన అవయవాలు దానం చేశారని సజ్జనార్ కొనియాడారు.