కఠినంగా లాక్‌డౌన్‌..రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు:సజ్జనార్

74
cp

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గురువారం మియాపూర్‌లో లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు సీపీ సజ్జనార్. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జేపీనగర్‌‌, చందానగర్‌ తారానగర్‌ మార్కెట్లతోపాటు రాజీవ్‌ గృహకల్ప కాలనీల్లో పర్యటించి పోలీసులు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న తీరు పరిశీలించారు. లాక్‌డౌన్‌ సమయంలో వాహనదారులు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డీజీపీ ఆదేశాలతో సరైన కారణం లేకుండా ఉదయం 10 గంటల తరువాత రోడ్ల మీదే తిరిగే వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు పోలీసులు. 10 గంటల తరువాత పాస్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు పోలీసులు.