కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాంటి ఉపయోగం లేదు: తలసాని

102
talasani

సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం లేక తన ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని పేర్కొన్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామం, హాలియా పట్టణాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలని కోరుతూ మంత్రులు తలసాని, మహమూద్ అలీ విస్తృత ప్రచారం నిర్వహించారు.

సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నప్పటికీ తన సొంత ఊరు అనుముల గ్రామ అభివృద్ధిని కుందూరు జానారెడ్డి పట్టించు కోలేదన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఎలాంటి ఉపయోగంలేదని, ఎవరు ఆ పార్టీని నమ్మడం లేదన్నారు.

అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన చరిత్ర దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కు ఉందన్నారు. ఆయన వారసుడు భగత్ ను అత్యధిక మెజారిటీ తో గెలిచేలా ఆశీర్వదించాలని కోరారు.