ఇక నిర్ణయం గవర్నర్‌దే….

231
Tamil Nadu governor Vidyasagar Rao is deliberately delaying
- Advertisement -

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం గంట గంటకు మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటార అనే దానిపై యావత్తు దేశం ఎదురుచూస్తుంది. పన్నీర్‌ సెల్వం వర్సెస్‌ శశికళ మధ్య రాజకీయాం ముదిరిపోయింది. ముఖ్యమంత్రిగా మరోమారు తనకు అవకాశం ఇవ్వలంటూ ఆపద్దర్మ ముఖ్యమంత్రి సెల్వం గవర్నర్‌ను కలిసి కోరారు.  గవర్నర్‌ భేటీ  తర్వాత మీడియాతో మాట్లాడిన సెల్వం తమిళ ప్రజలు త్వరలోనే ఓ గుడ్‌న్యూస్‌ వింటారు అని చెప్పారు.
 Tamil Nadu governor Vidyasagar Rao is deliberately delaying
సెల్వం భేటీ తర్వాత గవర్నర్‌తో వీకే శశికళ భేటీ అయ్యింది. దాదాపు 30నిమిషాల పాటు గవర్నర్‌తో శశికళ చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి కావడానికి తనకు పూర్తి మద్దతు ఉందని గవర్నర్‌ విద్యాసాగర్‌రావు శశికళ తెలిపింది. త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తోన్న నేతల్లో 10 మంది సీనియర్ నేత‌ల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్‌ను కలిసిన ఆమె  ఎమ్మెల్యేల సంత‌కాల‌తో కూడిన మ‌ద్ద‌తు లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించారు. ప్ర‌భుత్వం ఏర్పాటుకు అనుమతించాలని శ‌శిక‌ళ గవర్నర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న వారి జాబితాను గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేసింది. అయితే గవర్నర్‌తో భేటీ ముగిసిన త‌ర్వాత శశికళ మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోయింది.

 Tamil Nadu governor Vidyasagar Rao is deliberately delaying

అయితే గవర్నర్ ను కలిసిన అనంతరం పన్నీర్ సెల్వంలో ఓ సంతోషం, విజయం సాధించానన్న గర్వం కనిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు శశికళ ముఖంలో ఎటువంటి సంతోషం కనిపించకపోగా నిరాశ కనిపించడం గమనార్హం. గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించాక‌ ప‌న్నీర్ సెల్వంలో క‌నిపించిన సంతోషం చూస్తోంటే ఆయ‌న‌కు అనుకూలంగానే గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం ఉంటుంద‌ని ప‌లువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, అయితే మ‌ద్ద‌తు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తోన్న శ‌శిక‌ళ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని మ‌రికొంద‌రు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాజకీయాలపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ నెల‌కొంది.

- Advertisement -