- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా సెకండే వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని అన్ని రాష్ట్రాలకు సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అయితే కేసుల సంఖ్య మాత్రం స్వల్పంగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
గత 24 గంటల్లో 35,871 పాజిటివ్ కేసులు నమోదుకాగా 172 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,74,605కు చేరగా 2,52,364 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,10,63,025 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జికాగా 1,59,216 మంది కరోనాతో మృతిచెందారు. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 3,71,43,255 డోసులు వేసినట్లువైద్యశాఖ తెలిపింది.
- Advertisement -