పరకాల…షర్మిలకు షాకిచ్చిన ప్రజాప్రతినిధుల కోర్టు!

202
sharmila
- Advertisement -

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు ప్రజాప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో 2012లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పరకాలలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై ఎన్నికల కార్యక్రమం నిర్వహించారని విజయమ్మ, షర్మిలపై కేసు నమోదుకాగా ఈ కేసు నుండి తమను తప్పించాలని విన్నవించిన షర్మిల,విజయమ్మలకు షాక్ తగిలింది.

ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణలో భాగంగా బుధవారం విచారణ జరుగగా ఎన్నికల సందర్భంగా గతంలో పెట్టిన రెండు సెక్షన్‌లను హైకోర్టు కొట్టివేసిందని వైఎస్‌ విజయలక్ష్మి, షర్మిలా తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఐపీసీ 341 సెక్షన్‌ మాత్రమే కొనసాగించవచ్చని హైకోర్టు తీర్పును గుర్తుచేశారు.అయితే ఈ కేసులో ఆధారాలు లేనికారణంగా పిటిషనర్ల హాజరు మినహాయింపు కోరుతూ వైఎస్‌.విజయలక్ష్మి, షర్మిలా తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. విజయలక్ష్మి, షర్మిలతోపాటు నిందితులందరూ హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.

2012లో జగన్‌కు మద్దతుగా కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. దీంతో పరకాలలో ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఆ సమయంలో వైసీపీ నుండి కొండా సురేఖ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన విజయమ్మ, షర్మిలతో పాటు పలువురిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఇక ఆ ఎన్నికల్లో కొండా సురేఖపై టీఆర్ఎస్‌ అభ్యర్ధి భిక్షపతి గెలుపొందారు.

- Advertisement -