అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ

339
india
- Advertisement -

ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా నిలిచింది ఢిల్లీ. వరుస‌గా మూడో ఏడాది కూడా ప్ర‌పంచంలో అత్యంత క‌లుషిత రాజధానిగా నిలిచింది. 2018, 2019ల‌తో పోలిస్తే కాలుష్యం త‌గ్గినా.. మిగ‌తా ప్ర‌పంచ న‌గ‌రాల‌తో పోలిస్తే ఇండియాలోని న‌గ‌రాలే కాలుష్యానికి కేరాఫ్‌గా నిలుస్తున్న‌ట్లు ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.

106 దేశాల్లోని ప్ర‌భుత్వాలు, ఇత‌ర ప్రైవేటు సంస్థ‌లు సేక‌రించిన పీఎం2.5 డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఇక ప్ర‌పంచంలో అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ద‌క్షిణాసియానే టాప్‌లో ఉంది. ప్ర‌పంచంలోని టాప్ 30 న‌గ‌రాల్లో 22 ఇండియా నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని 2020 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వెల్ల‌డించింది. గ‌తేడాది లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో కాలుష్య స్థాయి గ‌ణ‌నీయంగా త‌గ్గినా.. మ‌న న‌గ‌రాలు మాత్రం ఇంకా కాలుష్యంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.

- Advertisement -