పసుపుబోర్డు ఏర్పాటు లేదు.. బీజేపీపై రైతుల ఆగ్రహం..

165
Turmeric Board
- Advertisement -

తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్న తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయంచేసింది. వంద రోజుల్లో బోర్డు సాధిస్తామంటూ ఓట్లు దండుకొని.. గెలిచిన తర్వాత మాయమాటలు చెప్తూ మభ్యపెడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌, రాష్ట్ర బీజేపీ నేతల బండారం పార్లమెంట్‌ సాక్షిగా బట్టబయలైంది. సోమవారం పసుపుబోర్డు ఏర్పాటుపై రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారానికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలలో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు.

కాగా,పసుపు రైతులను బీజేపీ ప్రభుత్వం దగాచేసింది. బోర్డు తెస్తానని మాటిచ్చిన ఎంపీ అర్వింద్‌ ఇప్పటికే తప్పించుకు తిరుగుతున్నారు. చివరకు ఏదీ తేలేకపోవడం ఆయన చేతకాని తనానికి నిదర్శనం. ఎంపీ అర్వింద్‌ తను స్వయంగా రాసిచ్చిన బాండ్‌ పేపర్‌ను, హామీని గాలికి వదిలేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

- Advertisement -