కమల్ కారుపై దాడి..

205
Kamal Haasan
- Advertisement -

సినీ న‌టుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్ గత రాత్రి కాంచీపురం జిల్లాలో ప్రయాణిస్తుంగా ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కమల్ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆదివారం కంచీపురంలో పర్యటించి తిరిగి హోటల్ కు కారులో వెళుతుండగా ఓ మందుబాబు పీల‌క‌దాకా తాగి క‌మ‌ల్ హాస‌న్ కారు విండోని ప‌గ‌ల‌గొట్టాడు. క‌మ‌ల్‌ను చూడాలంటూ అద్దాన్ని బ్రేక్ చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో క‌మ‌ల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు కాని,కారు అద్దం బాగా దెబ్బ‌తింది.

క‌మ‌ల్ హాస‌న్ కారుపై దాడికి య‌త్నించిన వ్యక్తిని ఎంఎన్ఎం కార్యకర్తలు బంధించి దేహ‌శుద్ది చేశారు. ఆ క్ర‌మంలో అతని ముక్కు నుండి ర‌క్తం కూడా కారింది. ఇంత‌లోనే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు మందుబాబుని అరెస్ట్ చేసి కేసు న‌మోదు చేశారు. గాయాలపాలైన అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసుల విచారణలో అతను కమల్ అభిమాని అని తేలింది. ఎంఎన్ఎం వర్గాలు మాత్రం ఇది కమల్ పై దాడికి యత్నమేనంటున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

- Advertisement -