మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రేమకథా చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యూర్ లవ్ స్టొరీగా హై ఎమోషన్స్ తో రూపొందిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.
కథ :
ప్రాణం కంటే పరువు ముఖ్యమనుకునే పెద్ద మనిషి శేషారాయనం (విజయ్ సేతుపతి). ఆయన ఒక్కగానొక్క కూతురు సంగీత అలియాస్ బేబమ్మ (కృతి శెట్టి). రోజూ బస్సులో కాలేజీకి వెళ్లే సంగీత మత్స్యకారకుటుంబానికి చెందిన ఓ పేదింటి అబ్బాయి ఆశి (వైష్ణవ్ తేజ్) ప్రేమలో పడుతుంది. సీన్ కట్ చేస్తే…ఇంట్లో వీరి ప్రేమ విషయం తెలియడం,తర్వాత శేషారాయనం పరువు కోసం ఏం చేశాడు..? చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ వైష్ణవ్ తేజ్, కృతిల నటన, కథా నేపథ్యం,క్లైమాక్స్, సాంకేతిక విభాగం. ప్రేమజంటగా కనిపించిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి సినిమాకి ప్రాణం పోశారు. తొలి సినిమా అయినా అద్భుతంగా నటించి మెప్పించారు. విజయ్ సేతుపతి పాత్ర సినిమాకు ప్రధానబలం. రాయనం పాత్రలో ఒదిగిపోయారు. కథానాయకుడి తండ్రిగా సాయిచంద్‌తో పాటు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్… ప్రేక్షకుడి ఊహకు తగినట్టు సాగే కథ.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోశాయి. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
తెలుగు తెరపై గతంలో వచ్చిన ప్రేమకథలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది. ఇప్పటివరకు సుఖాంతమయ్యే ప్రేమకథల్ని చూస్తుంటాం, విషాదాంతంగా మారే ప్రేమకథల్నీ చూస్తుంటాం. వాటికి భిన్నమైన ముగింపున్న చిత్రం ఉప్పెన.
విడుదల తేదీ:12/02/2021
రేటింగ్ : 3/5
నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
దర్శకత్వం: బుచ్చిబాబు సానా