న‌టుడు కాంతారావు భార్య మృతి..

234
Kantharao Wife
- Advertisement -

అలనాటి సీనియర్‌ నటుడు.. తెలుగు చిత్రసీమలో జానపద చిత్రాలకు పెట్టింది పేరు కాంతారావు. కత్తి వీరుడు కాంతారావుగా ఆయన ప్రజల హృదయాల్లో ప్రత్యేకమైన సంపాదించుకున్నారు. కాంతారావు 2009లో కన్నుమూయగా, ఈరోజు ఆయన భార్య హైమావతి మృతి చెందారు. హైమావతి వయసు 87 సంవత్సరాలు. ఆమె హైదరాబాదులోని మల్లాపూర్‌లో తమ నివాసంలో కన్నుమూశారు. హైమావతి గుండెపోటుకు గురై మరణించారు తెలుస్తోంది.

ఆమె మృతికి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కాగా, కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, కాంతారావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలు పెన్షన్ గా అందిస్తోంది. కాంతారావు చరమాంకంలో ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంతారావు తన కెరీర్లో జానపద చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు.

- Advertisement -