మహాత్ముడికి ఘన నివాళి..

196
ktr
- Advertisement -

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వ‌ద్ద గాంధీకి నివాళి అర్పించిన మోదీ.. బాపూజీ ఆశ‌యాలు ల‌క్ష‌లాది మందికి ప్రేర‌ణ‌గా నిలుస్తున్నాయ‌న్నారు. అమ‌రుల దినోత్స‌వం రోజున దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాల‌ను అర్పించిన వారి త్యాగాల‌ను గుర్తుచేసుకుంటామ‌న్నారు. రాజ్‌ఘాట్ వ‌ద్ద రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ఉపాధ్య‌క్షుడు ఎం వెంక‌య్య‌నాయుడు కూడా ఇవాళ బాపూజీ స‌మాధికి నివాళి అర్పించారు.

న‌గ‌రంలోని బాపు ఘాట్ వ‌ద్ద‌ జాతిపిత మ‌హాత్మా గాంధీ వ‌ర్ధంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. మ‌హాత్ముడి విగ్ర‌హాం వ‌ద్ద‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళుల‌ర్పించారు. మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, ముఠా గోపాల్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు నివాళుల‌ర్పించారు.

- Advertisement -