24 గంటల్లో 14,849 మందికి కరోనా..

158
corona
- Advertisement -

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,849 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కు చేరింది. అదే స‌మ‌యంలో 15,948 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 155 మంది కరోనా కారణంగా మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

దీంతో మృతుల సంఖ్య 1,53,339 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,16,786 మంది కోలుకున్నారు. 1,84,408 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 15,82,201 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -