- Advertisement -
చిలుకనగర్లో టీఆర్ఎస్ అభ్యర్ధి గీత ప్రవీణ్ ముదిరాజ్ తరపున ప్రచారం నిర్వహించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకానగర్ను దత్తత తీసుకొని ఒక మోడల్ డివిజన్ గా అభివృద్ధి చేస్తానని అన్నారు. చిలుకానగర్ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దామన్నారు.
తాను కూడా చిలుకానగర్ నివాసినేనని, దీనిని అభివృద్ధి చేయడంలో తనకు కూడా బాధ్యత ఉందన్నారు.టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నిరంజన్ భాస్కర్, చిలుకానగర్ తాజా మాజీ కార్పొరేటర్ గోపు సరస్వతి సదానందం గౌడ్, జెల్లీ మోహన్, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.
- Advertisement -