జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో అంతర్గత విభేదాలు వరుసగా బయటపడుతున్నాయి. టికెట్ల కేటాయింపు పార్టీ వర్గాల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ హెడ్ ఆఫీసులో గన్‌ఫౌండ్రీకి చెందిన నేతలు కొట్టుకున్నారు. గన్ ఫౌండ్రీ బీజేపీ అభ్యర్థి ఓంప్రకాష్‌పై శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో కుర్చీలు ధ్వంసం కావడం, పలువురి దుస్తులు చిరగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
అయితే బీ ఫార్మ్ తీసుకునేందుకు వచ్చిన ఓం ప్రకాష్ వర్గంతో శైలేందర్ వర్గం ఘర్షణకు దిగింది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓం ప్రకాష్‌కి ఎలా టికెట్ ఇస్తారని గన్ ఫౌండ్రీ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శైలేందర్ యాదవ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజసింగ్పై కిషన్ రెడ్డి , లక్ష్మణ్ కక్షకట్టారన్నారు. తాము రాజాసింగ్ వర్గం కాడంతో టికెట్ ఇవ్వలేదని పార్టీ పెద్దలపై శైలేంద్ర యాదవ్ విమర్శించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , లక్ష్మణ్‌లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.