టీఆర్ఎస్ గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కార్యాచరణ..

23
anil kurmachalam

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి, ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ మద్దతుదారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కోసం సోషల్ మీడియా ద్వారా నిర్వహించే ప్రచారంపై ఎన్నారైలకు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వై.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ఆరు సంవత్సరాల్లో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెంది దేశంలో మొట్ట మొదటి స్థానంలో నిలిచిందని, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శమైందని, అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసిందని తెలిపారు. ఎన్నారైలుగా ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక పోయినా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలని తిప్పి కొట్టాలని సతీష్ రెడ్డి అన్నారు.

ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ఉద్యమ సమయం నుండి నేటి వరుకు ఎన్నో వివిధ ఎన్నికల్లో అటు క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రాచారంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఎన్నో సేవలందించామని, అదే స్పూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం సైనికుల్లా పని చేసి బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగురవెయ్యడానికి కృషి చెయ్యాలని కోరారు. అలాగే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టి అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూస్తున్న బిజెపి పార్టీ విష ప్రచారాల్ని తిప్పి కొట్టాలని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అరాచకం కాదని అనిల్‌ తెలిపారు.

వీడియో కాన్ఫెరెన్స్ కు వక్తగా వ్యవహరించిన టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. దేశంలో ఎవరికీ లేని విధంగా టీఆర్ఎస్  పార్టీకి ప్రపంచ నలుమూలల శాఖలతో పాటు లక్షల కార్యకర్తలున్నారని, మనమంతా క్రియాశీలకంగా పని చేసి సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే టీఆర్ఎస్ గెలుపుకు ఎంతో మేలు జరుగుతుందని, ఎక్కడికక్కడ ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పి కొడుతూ అభృవుధ్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు అశోక్ గౌడ్ దూసారి(యూకే),  అరవింద్ తక్కలపెల్లి (అమెరికా), జువ్వాడి శ్రీనివాస్ (దుబాయ్), సతీష్ కుమార్ (బహరేన్), శ్యామ్ బాబు ఆకుల (డెన్మార్క్), చిట్టిబాబు చిరుత(మలేసియా), నీల శ్రీనివాస్ (ఫ్రాన్స్ ), మేడిపెల్లి వివేక్(ఆస్ట్రియా) ,శ్రీనివాస్ ఎముల(నార్వే), రాజేష్ రాపోలు(ఆస్ట్రేలియా), శ్రీధర్ ( స్విట్జర్లాండ్), శ్రీధర్ అబ్బగొని (ఖతార్) అరవింద్ గుంత (జెర్మనీ), మొహమ్మద్ హమీద్ (సౌదీ), షేఖ్ అహ్మద్ (ఒమాన్), అభిలాష గొడిశాల (కువైట్), గంగా రెడ్డి (మాల్టా ),ప్రసాద్ రావు (నార్వే), నవీన్ రెడ్డి (లండన్), సృజన్ రెడ్డి చాడ (లండన్), నిరంజన్ పొద్దుటూరి(అమెరికా), మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు సోషల్ మీడియా ద్వారా అనుసరించాల్సిన ఫ్యుహంపై హాజరైన ప్రతినిధులతో చర్చించారు. టీఆర్ఎస్ పార్టీ బల్దియాపై మళ్ళీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశం లో పాల్గన్న వారిలో ఎన్నారై టీఆర్ఎస్ ముఖ్య నాయకులు రత్నాకర్ కడుదుల,నరేందర్ రేడ్డి మేడసాని, హరీష్ రంగా, అనీల్ బైరేడ్డి,సందీప్, జై గుండా జై విష్ణు , వేంకట్రావ్ తాల్లపల్లి, సాయికిరన్ నల్ల ,అనిల్ బైరేడ్డి, నగేష్, రమేష్ బాబు, మారుతి,అరుణ్ ,శివాంత్ రేడ్డి,చిట్టి, ,ప్రదీప్, రామక్రిష్ణ,నవీన్ భువనగిరి, సురేష్ గోపతి, సత్య చిలుముల, సాయి తేజ, ప్రశాంత్, వినయ్ ఆకుల , తిరుపతి బొడ్డు, అబ్దుల్, శోభన్, తదితరులున్నారు.