టాలీవుడ్‌లో షూటింగ్‌ల సందడి!

165
tollywood
- Advertisement -

కరోనా మహమ్మారి,లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడటమే కాదు షూటింగ్‌లకు బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలె లాక్ డౌన్‌ సడలింపులతో షూటింగ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఇక చాలారోజుల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నవంబర్‌ ఫస్ట్‌ నుంచి “వకీల్‌సాబ్‌’లో సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఫుల్‌ స్పీడ్‌గా షూటింగ్‌ కంప్లీట్ చేస్తున్నాడు. ఇక రాజమౌళి సైతం ఆర్ఆర్ఆర్ మూవీ యాక్షన్ సీన్స్ చేస్తూ ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇస్తున్నారు.

ప్రభాస్‌ “రాధేశ్యామ్’ రీసెంట్‌గానే ఇటలీ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకుని హైదరాబాద్ తిరిగి రాగా నవంబర్ 2వ వారంలో అల్లు అర్జున్ పుష్ప మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభంకానుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ నవంబర్‌ 9 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే బాలక్రిష్ణ – బోయపాటి సినిమా షూటింగ్ ప్రారంభంకాగా నాగార్జున సైతం వైల్డ్‌ డాగ్ మనాలీ షెడ్యూల్‌ని పూర్తి చేశాడు. మొత్తంగా అగ్రహీరోల సినిమాల షూటింగ్‌ ప్రారంభం కానుండటంతో టాలీవుడ్‌లో సందడి నెలకొంది.

- Advertisement -