బన్నీ కోసం సుకుమార్ పాట్లు!

192
sukumar
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.పాన్ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీకి ఇది 20వ సినిమా.

కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ నవంబర్ రెండో వారం నుండి ప్రారంభంకానుంది. బన్నీ సరసన రష్మీక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారు అన్నదానిపై రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటివరకు కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు రాగా తాజాగా సునీల్ శెట్టి, బాబీ సింహా పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.అల్లు అర్జున్ తో స‌రితూగేలా ఉండే న‌టుడిని విల‌న్ గా సెలెక్ట్ చేయాల‌ని భావిస్తుండ‌గా.. విలన్‌గా సుకుమార్‌ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -