డ్రీమ్ క్యాచర్…సైకలాజికల్ థ్రిల్లర్!

11
- Advertisement -

ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్ కాకుల రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ ప్రణీత్ గౌతమ్ నందా మాట్లాడుతూ – ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సందీప్ కు థ్యాంక్స్. ట్రైలర్ చూశారు కదా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. జనవరి 3న మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

ట్రైలర్ మ్యూజిక్ చేసిన వెంకటేష్ మాట్లాడుతూ – ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాలో ర్యాప్ సాంగ్ చేయాలన్న ఆలోచన సందీప్ ఇచ్చాడు. ఈ పాటకే కాదు మొత్తం సినిమా అంతా చాలా ఫ్రీడమ్ ఇచ్చి తన టెక్నీషియన్స్ తో వర్క్ చేయించుకున్నారు. ఎడిటింగ్ టైమ్ లో ఈ సినిమాను వందసార్లు చూశాను. ప్రతిసారీ కొత్తగా అనిపించింది. ఆర్టిస్టులు ప్రశాంత్, అనీషా, శ్రీనివాస్ బాగా నటించారు. అన్నారు.

ట్రైలర్ మ్యూజిక్ చేసిన సిద్ధార్థ్ కాకుల మాట్లాడుతూ – ట్రైలర్ లో ఒక మంచి బీట్ తో లౌడ్ గా మ్యూజిక్ వినిపించే సాంగ్ కావాలని సందీప్ అడిగాడు. అలా ఈ ర్యాప్ సాంగ్ చేశాం. ఈ పాట మీ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. అన్నారు.యాక్టర్ నాగరాజు మాట్లాడుతూ – ‘డ్రీమ్ క్యాచర్’సినిమాలో నిఖిల్ అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సందీప్ కు థ్యాంక్స్. జనవరి 3న మీరంతా థియేటర్స్ కు వచ్చి తప్పకుండా మూవీ చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Also Read:దూరదర్శిని..అందరి కథ: సువిక్షిత్‌

యాక్టర్ శ్రీనివాస్ రామిరెడ్డి మాట్లాడుతూ – ‘డ్రీమ్ క్యాచర్’ సినిమాలో కార్తీక్ అనే క్యారెక్టర్ చేశాను. మనమంతా జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్ లో స్ట్రక్ అయి పోయి ఉంటాం. ఆ ఘటన జరిగినప్పుడు మనసులో ఒక సంఘర్షణ మొదలవుతుంది. అలా తన జీవితంలో జరిగిన ఓ ఘటన ప్రభావం నుంచి బయటపడేందుకు హీరో ఎలా ప్రయత్నించాడు అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా మా దర్శకుడు సందీప్ తెరకెక్కించాడు. ఆయన ప్రతి ఫ్రేమ్ ను డీటెయిల్డ్ గా తెరకెక్కించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎడిటింగ్ లో అనేక వెర్షన్స్ చేశాడు. ఇలాంటి పర్పెక్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

- Advertisement -