- Advertisement -
ఐపీఎల్ 2020లో భాగంగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
రవిచంద్రన్ అశ్విన్ వేసిన రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. కీలకమ్యాచ్‌లో రోహిత్ విఫలం కావడంతో ముంబై భారీ స్కోరు చేస్తుందా అన్న సందేహం అందరిలో నెలకొంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూర్యకుమార్ యాదవ్,డికాక్,హార్ధిక్ పాండ్యా,ఇషాన్ కిషన్ రాణించడంతో భారీ స్కోరు సాధించింది.
సూర్య కుమార్ యాదవ్(51), ఇషాన్ కిషన్(55), క్వింటన్ డికాక్(40),పాండ్యా (37) పరుగులు చేయడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది.
- Advertisement -