- Advertisement -
భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర ప్రజలకు ఇంటి వద్దకే కూరగాయలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
జంటనగరాలలో మొబైల్ రైతుబజార్ల ద్వారా నేటి నుండి 56 వాహనాలతో 102 ప్రాంతాలలో అందుబాటులోకి కూరగాయలు ఉంచుతామన్నారు. కరోనా సమయం నుండి పెద్ద ఎత్తున మొబైల్ రైతుబజార్లతో ప్రజలకు చేరువయ్యామని తాజాగా భారీ వర్షాలతో నిత్యావసరాలకు నగర వాసుల ఇబ్బందులు తప్పవన్నారు. వెంటనే స్పందించి వీలైన ప్రాంతాలలో మొబైల్ రైతుబజార్ల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
విపత్కర పరిస్థితులు, ప్రజలు ఇబ్బందులలో ఉన్న నేపథ్యంలో వీలైన ప్రతి చోటా మొబైల్ రైతుబజార్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -